అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ కార్లకు బ్లాక్ ఫిల్మ్ .. చలానా వేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

  • IndiaGlitz, [Sunday,March 27 2022]

కేంద్ర మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్‌లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగిన వాహనాలపై సైతం దృష్టి సారిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతోన్న పోలీసులు బ్లాక్‌ ఫిల్మ్‌లు తొలగించడంతో పాటు వారికి జరిమానా కూడా విధిస్తున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొద్ది రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే కుమారుడి కారు ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటన అనంతరం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సినీనటులు అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌లకు చెందిన కార్లకు బ్లాక్ ఫిల్ములు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బ్లాక్ ఫిల్మ్ లేయర్లను ట్రాఫిక్‌ పోలీసులు తొలగించారు. అనంతరం చలానాలు కూడా విధించారు. వీరిద్దరి కార్లకు రూ.700 చొప్పున జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.

దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు మాట్లాడుతూ.. శనివారం తాము జూబ్లీహిల్స్ రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఆ సమయంలోనే అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌‌కు చెందిన కార్లు అటుగా వెళ్తుంటే అడ్డుకున్నామని చెప్పారు. ఆ రెండు కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించామని వెల్లడించారు.

ఇకపోతే.. నల్ల ఫిల్మ్‌తో పాటు వాహనాలపై వివిధ హోదాలతో కూడిన స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కార్లు, బైకుల విండ్‌ షీల్డ్‌లపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌, ప్రభుత్వ వాహనం, ఆర్మీ, పోలీస్‌, ప్రెస్‌, ఇతర సంస్థలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకుంటే ఎంవీ యాక్ట్‌ ప్రకారం ప్రకారం తొలగిస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు, ఆయా హోదాలో ఉన్న వారికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

More News

ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు థ్యాంక్స్.. చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు .

అతడే నా గౌరవం.. చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి, ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు ఆయనకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి.

మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే

కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు, 8 మంది దుర్మరణం .. మోడీ, జగన్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

మొత్తానికి షాకిచ్చారుగా.. నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం, ఫొటోలు వైరల్

టాలీవుడ్‌లో మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఆయన ఎవరో కాదు. ఆది పినిశెట్టి.