బన్ని మనసు దోచుకున్న క్షణం...

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం స‌రైనోడు సినిమా బిజీలో ఉన్నారు. ఈ చిత్రం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. అయితే బ‌న్ని నిన్న రానా తో క‌ల‌సి క్ష‌ణం సినిమా చూసారు. క్ష‌ణం బ‌న్నికి బాగా న‌చ్చేసింద‌ట‌. వెంట‌నే క్ష‌ణం టీమ్ కి రెస్టారెంట్ లో ఓ పార్టీ కూడా ఇచ్చేసాడ‌ట‌.
అంత‌టితో ఆగ‌లేదు క్ష‌ణం సినిమా గురించి ట్విట్ట‌ర్ లో త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసాడు. ఇంత‌కీ ట్విట్ట‌ర్ లో ఏమ‌న్నాడంటే...గుడ్ ఫిలిమ్ గురించైనా బ్యాడ్ ఫిలిమ్ గురించైనా ట్వీట్ చేయ‌కూడ‌ద‌నేది నా పాల‌సీ. కానీ క్ష‌ణం సినిమా చూసాకా నా పాల‌సీకి మిన‌హాయింపు ఇచ్చాను. క్ష‌ణం సినిమా నాకు న‌చ్చింది. కొత్త‌త‌రం తెలుగు ద‌ర్శ‌కులు, న‌టులు మంచి చిత్రాల‌ను అందిస్తూ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళుతున్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ల‌వ‌ర్స్ త‌ప్ప చూడండి అంటూ క్ష‌ణం గురించి ట్విట్ట‌ర్ స్పందించాడు బ‌న్ని.

More News

నెక్ట్స్ సీన్ ఏమిటని ఇంట్రస్టింగ్ గా చూసే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ శౌర్య - దర్శకుడు దశరథ్

సంతోషం,సంబరం,స్వాగతం,శ్రీ ,మిస్టర్ పర్ ఫెక్ట్,గ్రీకువీరుడు...ఇలా కుటుంబ కథా చిత్రాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించే దర్శకుడు దశరథ్.

మార్చి 11న విడుదలవుతున్న 'ఓ స్త్రీ రేపు రా'

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆశిష్ గాంధీ,వంశీకష్ణ కొండూరి,కునాల్ కౌశిక్,దీక్షాపంత్,శృతి మోల్,మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'.

రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్2'

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్ 2.

బాలయ్య వందో సినిమా లేటెస్ట్ న్యూస్...

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా డైరెక్టర్ ఎవరు అనే విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకుంటున్న క్షణం.

భారీ చిత్రాలను నిర్మిస్తున్న పి.వి.పి సంస్థ కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం.అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ.