ఏప్రిల్ 26న 'నా పేరు సూర్య' గ్రాండ్ రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా... ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ క్లైమాక్స్ ను భారీస్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

More News

బోయపాటి శీను చేతుల మీదుగా 'ఎందుకో ఏమో' ఫస్ట్ సాంగ్ లాంచ్!!

మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్,పునర్నవి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో

యువి క్రియేషన్స్ , పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న 'హ్యాపి వెడ్డింగ్'

ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగమతి లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ని సాధించిన యువి క్రియేషన్స్

'అమ్మమ్మగారిల్లు' ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య,బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.

బన్నీ ఫాన్స్ కి వాలెంటైన్స్ డే కానుక

ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన అభిమానుల కోసం గిఫ్ట్ ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా రేపు ఉద‌యం 8.30 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నారు.

ఈ వారం కూడా కొనసాగిస్తారా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ లేనంతగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం కొత్త దర్శకుల సినిమాలు విడుదల అవుతుండడం విశేషం.