డీజే..దువ్వాడ జగన్నాథమ్ తో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోన్న - అల్లు అర్జున్

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైన‌మిక్ డైర‌క్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా 'డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రం ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లో క‌లిపి 7.4 మిలియ‌న్ల మంది చూడ‌టం విశేషం.

యూత్ ఐకాన్‌గా త‌న స్టైల్స్ తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మ‌ణ కుర్రాడిగానూ, స్టైలిష్ ఆఫీస‌ర్‌గానూ రెండు లుక్కుల్లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు ట్రైల‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగుల‌కు విప‌రీత‌మైన స్పంద వ‌స్తోంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట కూడా చూడ్డానికి క‌నువిందుగా ఉంది. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో మేకింగ్ వేల్యూస్ కూడా అదే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాకు అన్ని వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ద‌క్షిణాదిన బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ను తెచ్చుకున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం.

ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పాజిటివ్ రివ్యూల‌ను అందిస్తున్నారు. అల్లు అర్జున్ రెండు గెట‌ప్పుల్లో చాలా వైవిధ్య‌త‌ను క‌న‌బ‌రిచార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. డైలాగ్ డెలివరీలోనూ అల్లు అర్జున్ గ‌త చిత్రాల‌కు ఈ సినిమాకూ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జూన్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. అంత‌కు ముందే ఆడియో విడుద‌ల వేడుక‌ను భారీగా నిర్వ‌హించ‌డానికి కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పాట‌ల పండుగ తేదీని ప్ర‌క‌టిస్తారు. దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో చాలా మంది స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తినాయ‌కుడిగా రావు ర‌మేశ్ కు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

More News

'అంధగాడు' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - రాజ్ తరుణ్

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్,రాజ్ తరుణ్ కాంబినేషన్ లో విడుదలైన అంధగాడు మూవీ హ్యాట్రిక్ హిట్ అయ్యింది.

తాను ప్రేమలో ఉన్నానంటున్న హీరోయిన్....

సాధారణంగా హీరోయిన్స్ రూమర్స్ గురించి పట్టించుకోకుండా,అసలు విషయం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటారు.

శృతి ఘాటు రిప్లై..

దక్షిణాది,ఉత్తరాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమల్ తనయ,హీరోయిన్ శృతిహాసన్

మహేష్ కోసం అసెంబ్లీ సెట్...

స్పై థ్రిల్లర్ 'స్పైడర్ ' తో బిజీగా ఉన్న మహేష్ తర్వాతగా కొరటాల శివ దర్శకత్వంలో

రెండు రోజుల్లో 'జవాన్' ప్రీ లుక్..

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో