బన్ని నెక్ట్స్ సినిమాకు ముహుర్తం కుదిరింది...

  • IndiaGlitz, [Friday,February 17 2017]

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా స్టార్ట్ అవుతుందని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వ‌ర్క్ పూర్త‌య్యింద‌ట‌. వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టిరోజు ఏప్రిల్ 8న అధికార‌కంగా లాంచ్ అవుతుంద‌ట‌.

ఈ సినిమాను ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ నిర్మిస్తాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం బ‌న్ని హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రేపు విడుద‌ల‌వుతుంది. టీజ‌ర్ శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న‌ విడుద‌ల‌వుతుంది.

More News

మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదలవుతున్న 'యమన్'

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న గ్రాండ్రిలీజ్ అవుతుంది.

ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలొ కెసిఆర్ జన్మదినొత్సవ వేడుకలు

తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు.

'విశ్వరూపం 2' రెడీ అవుతుంది....

లోకనాయకుడు కమల్హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది.

'అమ్మ' సినిమా ఆగిపోయింది..

కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధానంగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు సినిమా పూర్తి కావచ్చింది కూడా. `అమ్మ` అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆగిపోయింది.

శంకర్ సెట్లో సల్మాన్ సందడి

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి చిట్టిగా రోబో 2.0 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న సైంటిఫిక్షన్ థ్రిల్లర్ 2.0 ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.