close
Choose your channels

నెక్స్‌ట్ ఎవరు?

Saturday, December 29, 2018 • తెలుగు Comments

నెక్స్‌ట్ ఎవరు?

'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం అందించిన పరాజయంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది. తన నెక్స్‌ట్ సినిమా ఏమిటనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు బన్ని.

కొత్త సంవత్సరం వేడుకల్లో తను చేయబోయే సినిమా గురించి తెలియజేస్తానని అంటున్నారు. ఆమధ్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే నాని హీరోగా విక్రమ్ సినిమా చేయబోతున్నారని ప్రకటించిన తర్వాత ఆ వార్తలకు తెరపడింది.

ఇప్పుడు బన్నితో త్రివిక్రమ్, పరశురామ్ చేయబోతున్నారని సమాచారం. అలాగే సంకల్ప్‌రెడ్డితో కూడా ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే బన్ని ఎవరి సినిమాను కొత్త సంవత్సరంలో ఎనౌన్స్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 

Get Breaking News Alerts From IndiaGlitz