close
Choose your channels

పాన్ ఇండియా చిత్రంగా అల్లు అర్జున్ 20.. టైటిల్ ఖరారు..!

Wednesday, April 8, 2020 • తెలుగు Comments

పాన్ ఇండియా చిత్రంగా అల్లు అర్జున్ 20.. టైటిల్ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే చిత్రానికి టైటిల్‌ను ‘పుష్ప‌’ అని ఖ‌రారు చేశారు. ఎప్పుడెప్పుడు టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూసిన త‌న అభిమానుల‌కు బ‌న్నీ ఈసారి పెద్ద బ‌ర్త్ డే గిఫ్ట్‌నే ఇచ్చాడు. సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డ‌మే కాదు. తాను పాన్ ఇండియా సినిమా చేస్తున్న‌ట్లు పోస్ట‌ర్స్ ద్వారా బ‌న్నీ చెప్ప‌క‌నే చెప్పాడు. దీంతో బ‌న్నీ అభిమానుల ఆనందానికి అంతే లేదు.

ఆర్య‌, ఆర్య 2లో అర్బ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో బ‌న్నీని ఎలివేట్ చేసిన సుకుమార్ మూడోసారి, ‘పుష్ప‌’ చిత్రంలో బ‌న్నీని స‌రికొత్త యాంగిల్‌లో ఎలివేట్ చేయ‌నున్నాడు. అది కూడా గ‌త రెండు చిత్రాల‌కు భిన్న‌మైన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. ఈ సినిమా కోసం గ‌డ్డం లుక్‌లో బ‌న్నీ క‌న‌ప‌డ‌బోతున్నాడు.  అలాగే బ‌న్నీ పినిమా కోసం చిత్తూరు జిల్లా యాస‌ను కూడా నేర్చుకున్నాడు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పుష్ప సినిమా విడుద‌ల కానుంది. ఎప్పటినుండో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాల‌నుకుంటున్న బ‌న్నీ పుష్ప‌తో ఏకంగా పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. హీరో క్యారెక్ట‌ర్ పేరు పుష్ప‌రాజ్‌. అందులో నుండే పుష్ప అనే పేరుని తీసుకున్నార‌ని టాక్.

Get Breaking News Alerts From IndiaGlitz