భారీ సినిమా ప్లాన్ లో బన్ని..

  • IndiaGlitz, [Saturday,May 06 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా త‌న మార్కెట్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న బ‌న్ని త‌ర్వాత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 'నా పేరు శివ నా ఇల్లు ఇండియా' సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పుడు త‌న సినిమా మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నాడ‌ట బ‌న్ని. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అయితే అందుకు స‌మయం ప‌ట్టేలాఉంది. అలాగే ఈలోపు అల్లుఅర్జున్ విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

13బి, ఇష్క్‌, మ‌నం, 24 సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న విక్ర‌మ్ కుమార్ ఇప్పుడు అఖిల్ హీరోగా జున్ను అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విక్ర‌మ్ కుమార్ వంటి డైరెక్ట‌ర్ అయితే యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌తో సినిమా చేయ‌గ‌ల‌డ‌ని బ‌న్ని భావిస్తున్నాడ‌ట‌. విక్ర‌మ్‌కుమార్‌కు మంచి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని కోరాడ‌ట‌. ప్ర‌స్తుతం అఖిల్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న విక్ర‌మ్ కుమార్ క‌థ ప్రిపేర్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే అల్లుఅర్జున్‌, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంద‌ట‌. తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కులకు విక్ర‌మ్ కుమార్ అంటే ఎలాగూ ఐడియా ఉంది. ఇక త‌న‌కు మ‌ల‌యాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సినిమా చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాడ‌ట బ‌న్ని.

More News

లావణ్య విత్ లవ్ బాయ్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ!

సాంబ,యోధ,కిరణ్,పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

అతనే నా చివరి దర్శకుడంటున్న హీరోయిన్...

బాలీవుడ్ లో క్వీన్,తను వెడ్స్ మను సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కంగనా రనౌత్

చైతు పాత్రలో జీవీ ప్రకాష్

తమిళ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి జీవీ ప్రకాష్ సిద్ధమయయాడు. చైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 100%లవ్ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారట.

ఆగస్ట్ 11న విడుదలవుతున్న 'ఓటర్'

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

'రక్షకభటుడు' అన్నీవర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - ఎ.గురురాజ్

నటుడుగా చిత్ర పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించిన గురురాజ్ పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించారు.