ఆ కాంప్లిమెంట్స్ తో స‌ర్ ప్రైజ్ అయ్యానంటున్న‌ బ‌న్ని

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..ఫెర్ ఫార్మెన్స్, డాన్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌తి సినిమాలో కొత్త‌ద‌నం కోసం త‌పిస్తూ..వైవిధ్య‌మైన సినిమాల‌ను అందిస్తున్నాడు. అందుక‌నే బ‌న్నికి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, సాండిల్ వుడ్...లో కూడా క్రేజ్ ఉంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..సౌతిండియా సినిమాలు హిందీలో డబ్ అవుతుంటాయి. అలా డ‌బ్ అయిన వాటిలో బ‌న్ని రేసుగుర్రం సినిమా ని సెట్ మాక్స్ లో చూసి చాలా ఎంజాయ్ చేసారట‌.

ఇంత‌కీ...రేసుగుర్రం సినిమాను హిందీలో చూసి ఎంజాయ్ చేసింది ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆయ‌నే ఇండియ‌న్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్. ఇటీవ‌ల క‌పిల్ దేవ్ ను బ‌న్ని క‌లిసిన‌ప్పుడు ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పార‌ట‌. దీంతో క‌పిల్ దేవ్ నా సినిమా చూసి రేసుగుర్రంలో నా న‌ట‌న గురించి మాట్లాడ‌డం చాలా ఆశ్య‌ర్యం క‌లిగించింది అంటూ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నాడు బ‌న్ని .