close
Choose your channels

‘తగ్గేదే..లే’ అంటూ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్..

Friday, April 9, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘తగ్గేదే..లే’ అంటూ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడవ చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను 'ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌ ' పేరుతో చిత్ర యూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘తగ్గేదే.. లే’ అంటూ బన్నీ తన టీజర్‌తో రికార్డ్ దిశగా దూసుకెళ్లాడు.

ఇప్పుడు ఈ టీజర్ ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు పుష్ప టీజర్‌ 30 మిలియన్ల వ్యూస్‌, 9 లక్షలకు పైగా లైకులు సంపాదించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఓ ప్రత్యేకమైన పోస్ట్‌ర్‌ ద్వారా వెల్లడించింది. అతి తక్కువ సమయంలో 30 మిలియన్ల వ్యూస్ రావడంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకూ బన్నీ ఈ తరహా మాస్ క్యారెక్టర్‌ను అయితే చేసింది లేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌లోనూ శేషాచల అడవుల్లో జరిగే ఛేజింగ్ తాలుకు ఆసక్తికర సన్నివేశాలను చిత్ర యూనిట్ చూపించింది.

అలాగే ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’లో అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు రావడం... వారి నుంచి తప్పించుకోవడానికి విజిల్స్‌ ద్వారా సంజ్ఞలు ఇచ్చుకుంటూ ఎలా తప్పించుకుంటారనేదాన్ని ప్రముఖంగా చూపించారు. పుష్పరాజ్ లుక్‌ను సైతం పరిచయం చేశారు. అలాగే గొర్రెలు, మేకలు మధ్యలో ఎర్ర చందనం దుంగలను కొంత మంది తరలించే సన్నివేశాన్ని కూడా టీజర్‌లో చూపించారు. సుబ్రహ్మణ్యస్వామికి కావడి తీసుకెళ్లే భక్తురాలిగా రష్మిక ఆకట్టుకుంది. ఇక భారీ లారీ యాక్షన్‌ చేజింగ్‌ సీన్‌తో పాటు.. అల్లు అర్జున్‌ను పట్టుకునేందుకు వెంటాడే సీన్‌ను కూడా టీజర్‌లో చూడొచ్చు. ఆగస్ట్‌ 13న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.