యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప‌’

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాష‌ల్లో రూపొందుతో్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ రివేంజ్ డ్రామాను యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అందుకోసం ప్లానింగ్ కూడా జ‌రుగుతోంద‌ట‌. సినిమాను కేర‌ళ‌లోని కానీ, మారేడు మ‌ల్లి, వికారాబాద్ అట‌వీ ప్రాంతాల్లో షూటింగ్ చేయాలా? అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని, త‌న పాత్ర పేరు పుష్ప‌రాజ్ అని స‌మాచారం. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌నుకుంటున్న త‌రుణంలో కోవిడ్ ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగింది. కేంద్ర ప్ర‌భుత్వ విధివిధానాల‌తో త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం బ‌న్నీగ‌డ్డం ఉన్న లుక్‌లో క‌నిపిస్తున్నారు.

More News

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

ఇవాళంతా కిల్లర్ కాయిన్స్ టాస్క్‌తోనే షో మొత్తం నడిచింది. షో స్టార్టింగ్ స్టార్టింగే సొహైల్‌కి అమ్మ రాజశేఖర్‌కు మధ్య రచ్చ.

సినిమా థియేట‌ర్స్‌, స్కూల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

కేంద్ర ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్‌ను ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 30తో అన్‌లాక్ 4.0 ముగిసింది.

ఆ హీరోయిన్‌లిద్దరికీ డ్రగ్సే కాదు.. సెక్స్ రాకెట్‌తోనూ సంబంధాలు..!

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన పాయ‌ల్‌.. డైరెక్ట‌ర్‌కి స‌మ‌న్లు

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని క‌లిసింది.