తాత గొప్ప‌త‌నం ఈరోజు ఇంకా బాగా తెలుస్తుంది:  అల్లు అర్జున్‌

  • IndiaGlitz, [Friday,July 31 2020]

ఈరోజు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి. ఆయ‌న 16 వ‌ర్ధంతి నేడు. సినీ ప్రియులు, ఆయన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబంలో అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాత‌య్య‌ను గుర్తు చేసుకున్నారు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఈ రోజు ఆయ‌న మ‌మ్మ‌ల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయ‌నేంటో, ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో ఈరోజు నాకు ఇంకా బాగా అర్థ‌మ‌వుతుంది. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభ‌వాల కంటే, ఆయ‌న పెట్టిన ఎఫ‌ర్ట్స్‌, చేసిన‌ ప్ర‌యాణం, ఆయ‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌కు నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమాల‌పై ఓ పేద రైతుకున్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం’’ అంటూ బ‌న్నీ నివాళులు అర్పించారు.

పుట్టిల్లు సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన అల్లు రామ‌లింగ‌య్య ఐదు ద‌శాబ్దాల పాటు త‌న‌దైన మార్కు కామెడీ ప్రేక్ష‌కుల‌ను గుండెల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్నారు. ఈయ‌న న‌టుడే కాదు.. హోమియోప‌తి వైద్యుడు కూడా. సినీ రంగానికి ఈయ‌న చేసిన సేవ‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం 1990లో ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌దానం చేసింది. రేలంగి త‌ర్వాత ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న తెలుగు హాస్య‌న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య‌గారే కావ‌డం విశేషం.

More News

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సన్నిహితులు బహుమతులిచ్చి సర్‌ప్రైజ్ చేయడం కామన్‌. కానీ రీల్ లైఫ్ విలన్..

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ పునర్నియామకం..

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గురువారం అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1986 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్‌లో కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక సమాచారమిచ్చిన రాజేష్ భూషణ్..

ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనా విముక్తి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనికోసం శాస్త్రవేత్తలు కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.

ఏపీలో మరోసారి షాకిచ్చిన కరోనా.. భారీగా కేసుల నమోదు

ఏపీలో కరోనా మరోసారి షాకిచ్చింది. తొలిసారిగా బుధవారం 10 వేలు దాటిన కేసులు.. నేడు అంతకంటే మరికొన్ని ఎక్కవే నమోదు కావడం గమనార్హం.