హీందీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కు బీటౌన్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇటీవలే సరైనోడు హిందీ వెర్షన్ ను సోనీ మ్యాక్స్ ఛాన్ ల్ లో టెలికాస్ట్ చేసి అదే రోజున, య్యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వెంటనే ఈ సినిమాకు కేవలం 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్ 4 రోజుల్లో 16 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా, బాలీవుడ్ కండలవీరుడు సల్లూభాయ్ అప్ కమింగ్ మూవీ ట్యూబ్ లైట్ క్రియేట్ చేసిన రికార్డుల్ని బద్దలుకొట్టింది.
ఇంతవరకు య్యూట్యూబ్ లో ఏ భారతీయ సినిమా నమోదుచేయని రికార్డుల్ని సరైనోడు క్రియేట్ చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. య్యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకోవడమే కాకుండా, అస్ట్రేలియా, బెహరీన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో నెంబర్ వన్ పోజిషన్ లో సరైనోడు ట్రెండ్ అవుతుండటం విశేషం. మూడు రోజులుగా నెంబర్ వన్ గానే కొనసాగుతున్నాడు సరైనోడు. అలానే ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 లిస్ట్ లో సరైనోడు చోటు దక్కించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ గత సినిమా సన్నాఫ్ సత్యమూర్తి హిందీ వెర్షన్ కూడా 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా స్టైలిష్ స్టార్ దూసుకుపోతుండటంతో మెగా అభిమానుల్లో పండగ వాతవరణం నెలకొంది.

More News

'కాలా' కథను తస్కరించారా?

సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. `లింగ` సినిమా సమయంలో కూడా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.

అఖిల్ అమ్మగా బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు టబు అంటే సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాల్లో నటించింది.

కల్యాణ్ రామ్ తో జోడిగా...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో

బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు.

అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు...

విలక్షణమైన ప్రేమకథలు,యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో