స్వీడ‌న్ మోడ‌ల్‌తో బ‌న్నీ ప్ర‌త్యేక గీతం

  • IndiaGlitz, [Monday,March 19 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న‌ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన గీతాన్ని ఎటువంటి డాన్స్ మూమెంట్స్ లేకుండా తెరకెక్కించారట. కీలకమైన సన్నివేశంలో వచ్చే ఈ పాట.. అర్ధవంతమైన సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంట.

ఈ పాటను స్వీడన్ మోడల్, బాలీవుడ్ నటి అయిన ఎల్లి అవ‌ర్రామ్, బన్నీలపై చిత్రీకరించారని తెలిసింది. బన్నీతో పాటంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాయని, అయితే.. డాన్స్ మూమెంట్స్ ఏమీ లేవని, ఇది ఐటెం సాంగ్ మాత్రం కాదని చెప్పుకొచ్చింది ఎల్లి  అవ‌ర్రామ్. బాలీవుడ్ మూవీ ‘క్వీన్’కు రీమేక్ గా తమిళంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతున్న ‘పారిస్ పారిస్’ చిత్రంలో ఎల్లి  అవ‌ర్రామ్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే..  మే 4న‌ ‘నా పేరు సూర్య’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మ‌రోసారి త‌మ‌న్ డబుల్ ధ‌మాకా

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌కు ఈ ఏడాది బాగానే క‌లిసొస్తోంది. ఒక‌వైపు వ‌రుస విజ‌యాలు అందుకుంటూనే.. మ‌రోవైపు వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్నాడు.

వై.ఎస్‌.ఆర్‌. బ‌యోపిక్‌లో సూర్య‌?

దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితకథను 2010లో 'భగీరథుడు' పేరుతో రూపొందించారు.

వ‌రుణ్‌తేజ్‌.. 14 రీల్స్ ప్ల‌స్.. సాగ‌ర చంద్ర క‌ల‌యిక‌లో కొత్త చిత్రం

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌,

కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు.

'ఉగ్రం' ఫస్ట్ లుక్ విడుదల

నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా,