close
Choose your channels

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

Thursday, August 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప.

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలన సృష్టించింది. ఈ పాటకు సంబంధించిన కొన్ని ప్రీ టీజర్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీటికి సైతం మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలవనుంది.

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.