రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పుష్ప'.. బాలీవుడ్ స్టార్ తో బన్నీ పోటీ!

  • IndiaGlitz, [Tuesday,August 03 2021]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అడవుల్లో సాగే ఈ కథని సుకుమార్ కనీవినీ ఎరుగని విధంగా తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని రఫ్ లుక్ లో సుక్కు చూపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తో ఇప్పటికే పుష్ప మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో పెద్ద చిత్రాలన్నీ సరైన డేట్ చూసుకుని రిలీజ్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. పుష్ప రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త.

పుష్ప చిత్ర యూనిట్ కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి వద్ద ఇప్పటికే భారీ చిత్రాలతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనితో సుక్కు అండ్ టీం క్రిస్టమస్ ని ఎంచుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఐదు భాషల్లో పుష్ప చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సౌత్ లో పుష్ప చిత్రానికి ఈ రిలీజ్ డేట్ విషయంలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. కానీ హిందీలో కూడా రిలీజ్ అవుతోంది కాబట్టి అక్కడ పోటీ తప్పదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రం కూడా క్రిస్టమస్ సందర్భంగానే విడుదల కానుంది. అమీర్ ఖాన్ హిందీలో ఎంత పెద్ద హీరోనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అమీర్ ఖాన్ తో బన్నీ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక పుష్ప చిత్రంలోని తొలి సాంగ్ ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ సంగీత దర్శకుడు. బన్నీకి జోడిగా ఈ చిత్రంలో రష్మిక మందన నటిస్తోంది.