Pushpa The Rise: రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప .. విడుదల ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,November 29 2022]

భారతీయ సినిమాలకు ఇప్పుడు అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే అయినా.. ఇటీవలి కాలంలో దంగల్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటి బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు.

ప్రమోషన్స్ కోసం రష్యాకు చేరుకున్న అల్లు అర్జున్- రష్మిక:

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో కేరళలలోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మూవీ స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ రీరిలీజ్ జరుగుతుందని భావిస్తున్నారు. అభిమానులు దీనిపై చర్చించుకుంటూ వుండగానే... వారికి శుభవార్త చెప్పారు మేకర్స్. పుష్ప పార్ట్ 1ని డిసెంబర్ 8న రష్యాలో రీరిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు .. ఈ మూవీ ప్రమోషన్ కోసం పుష్ప యూనిట్ రష్యా వెళ్లనుంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రెస్‌మీట్‌లు నిర్వహించనున్నారు.

ఇప్పటికే మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్:

మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను రష్యన్ సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో రష్యన్ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. ఏదేమైనా మన తెలుగు సినిమా రష్యన్ భాషల్లోకి అనువాదమై రిలీజ్ అవుతుండటం తెలుగు వారందరికీ గర్వకారణం.

ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్ :

మరోవైపు.. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌లో రెండు వారాల పాటు చిత్రీకరణ జరిగే అవకాశం వుంది. అక్కడి అడవుల్లో రెండ్రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. స్నేహితుని పెళ్లి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన బన్నీ.. అక్కడి నుంచి నేరుగా బ్యాంకాక్‌లోని చిత్ర యూనిట్‌ను కలుస్తారట. తొలి పార్ట్ మాదిరే క్రిస్మస్ సీజన్‌లోనే పుష్ప ది రూల్‌ని రిలీజ్ చేస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More News

రాజకీయాల వల్లే సినిమా విలువ తెలిసింది...అవినీతి లేనిది చిత్ర పరిశ్రమలోనే : చిరంజీవి వ్యాఖ్యలు

గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీ 5లో ‘చుప్:  రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ చిత్రం 24 గంటల్లో 30 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్

మన ఇండియాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగానికి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది.

Rashmika Mandanna: రష్మికపై బ్యాన్.. కన్నడ నాట పుష్ప 2కి బాయ్‌కాట్ గండం..?

వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూ నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్నపై

Telangana New Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రత్యేకతలివే!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ధనుష్, శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం ప్రారంభం

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్,