'పుష్ప' షూటింగ్‌ అప్‌ డేట్‌

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

ఆర్య, ఆర్య 2 తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 'పుష్ప'. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. కాగా.. ఈ సినిమా రీసెంట్‌గా మారేడుమిల్లి, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో చిత్రీకరణను స్టార్ట్‌ చేసుకుంది. కోవిడ్‌ నేపథ్యంలో కొంత మంది యూనిట్ సభ్యులకు కోవిడ్‌ సోకి గ్యాప్‌ వచ్చినప్పటికీ బన్నీ, సుకుమార్‌ శరవేగంగా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

మారేడు మిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో  గిరిజనులు, అధికారుల సహకారంతోనే ఈ రెండు షెడ్యూల్స్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశామని నిర్మాతలు తెలిపారు. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న 'పుష్ప'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి తెన్‌కాశీ, పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు, పాటను చిత్రీకరిస్తారట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నారట.

More News

నా సినిమా ఒక తండ్రికి ప్రేరణనివ్వడం ఆనందాన్నిచ్చింది: విజయశాంతి

ఒక పోలీస్‌ అధికారిణి.. క్రైమ్‌ రేటు, మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు...

చిన్న బ్రేక్ అంతే.. మ‌ళ్లీ వ‌స్తా: రామ్‌

ఈ  సంక్రాంతికి రెడ్ చిత్రంతో సంద‌డి చేసిన ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌.. నెక్ట్స్‌ మూవీ ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

విశాఖ ఉక్కు.. వైసీపీనోరు మెదపదేం?

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటు టీడీపీ నేతలు, అటు సామాన్య ప్రజానీకం మండిపడుతోంది.

ముగ్గురిలో విజ‌య్‌తో న‌టించ‌బోయేది ఎవ‌రో..!

సంక్రాంతికి `మాస్టర్‌`తో సంద‌డి చేసిన కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ నెక్ట్స్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో

స‌మంత @ 1.5 కోట్లు

స‌మంత అక్కినేని 1.5 కోట్లు ఏంటి?  ఏదేని సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అని అనుకుంటున్నారా?  కాదండి..