'పుష్ప' కోసం ప్లాన్‌ మార్చిన బన్నీ అండ్‌ టీమ్‌

  • IndiaGlitz, [Friday,December 11 2020]

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ వెయిటింగ్‌ ఉండి దాదాపు ఏడాది కావస్తుంది. మరో పక్క 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌ మరో సినిమానే చేయలేదు. వీరిద్దరూ ప్యాన్‌ ఇండియా మూవీగా 'పుష్ప' సినిమా చేయాలనుకుంటే కోవిడ్‌ కారణంగా సినిమా షూటింగ్‌ ఆరేడు నెలలు స్టార్ట్‌ కానేలేదు. కేరళకు వెళ్లకుండా మారేడుమిల్లిలో చిత్ర యూనిట్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేసింది. అయితే సినిమా షూటింగ్‌కు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. దీంతో షూటింగ్‌ను ఆపేసిన యూనిట్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. తర్వాత పుష్ప షూటింగ్‌ గురించి అప్‌డేట్‌ లేదు కానీ.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బన్నీ అండ్‌ టీమ్‌ ఈసారి మారేడు మిల్లికి వెళ్లకుండా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనే షూటింగ్‌ను చేస్తారట. రెండురోజుల్లో పుష్ప షూటింగ్‌ రీస్టార్ట్‌ అవుతుందని సమాచారం. ఈసారి మరింత కట్టుదిట్టంగా.. తగు జాగ్రత్తలతో వీలైనంత మంది తక్కువ క్రూతో సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాడట.

చిత్తూరు జిల్లాశేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్ర‌ధాన కథాంశం ర‌న్ అవుతుంది. ఇందులో బ‌న్నీ పాత్ర‌ను.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే కూలీగా చేరి త‌ర్వాత లారీ డ్రైవ‌ర్‌గా మారి, త‌ర్వాత పెద్ద స్మ‌గ్ల‌ర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడ‌నేలా సుక్కు తీర్చిదిద్దార‌ట‌.

More News

'సోలో బ్రతుకే సో బెటర్‌' టైటిల్‌ ట్రాక్‌ విడుదల

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో

ప్ర‌భాస్‌తో వ‌రుణ్‌తేజ్ హీరోయిన్‌..?

వ‌రుణ్‌తేజ్‌తో లోఫ‌ర్ సినిమాలో జోడీ క‌ట్టిన ముద్దుగుమ్మ దిశాప‌టాని ఇప్పుడు ప్ర‌భాస్‌తో జ‌త క‌ట్ట‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న 'దొరకునా ఇటువంటి సేవ' మూవీ పోస్టర్

ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అదే 'దొరకునా ఇటువంటి సేవ'. ఈ పోస్టర్‌లో నటీనటులు ఎవరూ లేరు.

ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏమన్నారంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ స్పందించారు.

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

టాస్క్‌లో భాగంగా సొహైల్ కుర్చీపై కూర్చొన్న సీన్‌తో షో స్టార్ట్ అయింది. ఇవాళ కూడా అరియానా రచ్చ స్టార్ట్ చేసింది.