close
Choose your channels

స్మగ్లరుగా మారనున్న అల్లు అర్జున్?

Wednesday, November 20, 2019 • తెలుగు Comments

స్మగ్లరుగా మారనున్న అల్లు అర్జున్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత రూపొంద‌నున్న హ్యాట్రిక్ మూవీ ఇది. చిత్తూరు జిల్లా త‌ల‌కోన, తిరుప‌తి బ్యాక్‌డ్రాప్‌లో సాగే క‌థ ఇది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో బ‌న్నీ ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ క‌న‌ప‌డ‌తాడ‌ట‌. బ‌న్నీ లుక్‌ను త‌న‌దైన స్టైల్లో సుకుమార్ డిఫ‌రెంట్‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఇందులో మెయిన్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌, చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం కావ‌డంతో న‌టీన‌టుల‌ను చిత్తూరు యాస నేర్చుకోవాల‌ని సుకుమార్ సూచించాడు.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం `అల‌...వైకుంఠ‌పుర‌ములో...`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ.

Get Breaking News Alerts From IndiaGlitz