close
Choose your channels

ఆ దర్శకుడితో బన్నీ మరోసారి..?

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో యువ క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. అంతేగాకుండా.. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా తనకి తాను మార్చుకోవడంలోనూ ఈ స్టైలిష్ స్టార్ స్టైలే వేరు. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` పేరుతో బన్నీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే కొత్త కథలను వినడం ప్రారంభించిన బన్నీకి.. ద‌ర్శ‌కుడు క్రిష్ చెప్పిన కథ ఒక‌టి బాగా నచ్చేసిందనీ.. దానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారనీ టాలీవుడ్ సర్కిల్క్‌లో క‌థనాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని సమాచారం. గతంలో బన్నీ, క్రిష్ కాంబినేష‌న్‌లో వేదం` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల క్రిష్ అహం బ్రహ్మస్మి` అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. అది ఈ సినిమా కోసమేనని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. బన్నీ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` మే 4న విడుదల కానుంది. అలాగే క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హిందీ చిత్రం 'మ‌ణిక‌ర్ణిక' ఆగ‌స్టు 15న రిలీజ్ కాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.