అల్లు అయాన్ అభిమాన హీరో ఎవ‌రో తెలుసా?

  • IndiaGlitz, [Monday,March 16 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్‌కు పెద్ద అభిమానట‌. ఆ విష‌యాన్ని చెప్పిందెవ‌రో కాదు..స్వ‌యానా అల్లు అర్జున్‌. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన బాఘి, బాఘి2 చిత్రాల‌కు అల్లు అయాన్ పెద్ద అభిమానట‌. ఈ సంద‌ర్భంగా ఇప్పుడు బ‌న్నీ పోస్ట్ చేసిన వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. అయాన్ త‌న అభిమాన హీరో గురించి మాట్లాడుతుండే వీడియోను బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోలో అయాన్ త‌న‌ను బాఘి 3 సెట్‌కు తీసుకెళ్లాల‌ని బ‌న్నీని కోరాడు. దానికి ఎందుకంటే నేను ఆయ‌న శ‌రీరం, గ‌న్ ఫైట్స్ చూడాల‌నుకుంటున్నాను అని స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియోలో అయాన్ టైగ‌ర్‌ను టైగ‌ర్ స్కాష్ అని సంబోధించడం విశేషం.

ఈ వీడియో చూసి టైగ‌ర్ ష్రాప్ దాన్ని షేర్ చేస్తూ.. నా కొత్త పేరు బాగా న‌చ్చింది. కేవ‌లం బాఘి 3కే కాదు.. నా సినిమా సెట్స్ అన్నింటిలో అయాన్‌కు ఆహ్వానం ఉంటుంద‌ని చెప్పండి అల్లు అర్జున్ స‌ర్ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఈ వీడియో పంప‌డం.. షేర్ చేయ‌డం ఇప్పుడు జ‌రిగిందేమో కానీ.. బాఘి 3కి ముందే ఇదంతా జ‌రిగింద‌ని చూస్తుంటే అనిపిస్తుంది. ఏదైతేనేం మెగా క్యాంపులో డ‌జను హీరోలున్న‌ప్ప‌టికీ టైగ‌ర్‌ష్రాప్‌ను ఇష్ట‌ప‌డ్డాడు అల్లు అయాన్‌.

More News

ఏపీలో ఎన్నికలు యథావిథిగా జరుగుతాయా..!?

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే.

మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

కరోనా ఎఫెక్ట్: ‘అరణ్య’ వాయిదా

అనుకున్నట్లే అయ్యింది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘అరణ్య’.

కరోనా వైరస్‌పై సినిమా.. తొలి టైటిల్ ఏంటో తెలుసా?

సినిమా వాళ్లు సినిమా వాళ్లే.. ఓ విష‌యాన్ని సినిమా కోణంలో ఆలోచిస్తుంటారు. తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతుంది.

టాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌ అన్నీ నిలిపివేత..

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకుంది.