close
Choose your channels

డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటన వైపు.. అల్లు రామలింగయ్య టూ సాయి పల్లవి

Thursday, July 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటన వైపు.. అల్లు రామలింగయ్య టూ సాయి పల్లవి

చాలా మంది ప్రముఖులు వారి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలిపెట్టి సినిమాల్లో సెటిల్ అయ్యారు. ఓ సాధారణ బస్సు కండక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎలా మారాడో మనందరికీ తెలుసు. ఇలా ఎందరో స్టార్లు తమ అసలైన వృత్తిని వదిలిపెట్టి సినీవినీలాకాశంలో స్టార్లుగా ఎదిగారు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటులుగా మారిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం.

'రంగం'లో సీఎం.. రియల్ లైఫ్ లో డాక్టర్

రంగం చిత్రంలో విలన్ పాత్రలో నటించిన యువ నటుడు అజ్మల్ అమీర్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఆ చిత్రంలో కుట్ర పూరితమైన యువ ముఖ్యమంత్రిగా నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించాడు. రియల్ లైఫ్ లో అజ్మల్ ఓ డాక్టర్. ఉక్రెయిన్ లోని నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో అజ్మల్ డాక్టర్ చదివారు.

హైబ్రీడ్ పిల్ల.. డాక్టర్ సాయి పల్లవి

తన చలాకీతనంతో వెండితెరని వేడెక్కించే సాయి పల్లవి డాక్టర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. నేచురల్ అందం, నటన, నాట్యం సాయిపల్లవి క్రేజీ హీరోయిన్ గా మారడానికి కారణాలు. కానీ కార్డియాలజిస్ట్ గా సేవలు అందించాలనేది సాయి పల్లవి కల. జార్జియాలోని తబలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016లో సాయి పల్లవి ఎంబిబిఎస్ పూర్తి చేసింది.

ఉమా మహేశ్వర ఉగ్రహరూపస్య హీరోయిన్

ఉమా మహేశ్వర ఉగ్రహరూపస్య చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రూపా ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ఈ యంగ్ హీరోయిన్ కూడా డాక్టరే. రూపా గుంటూరు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హౌజ్ సర్జన్ పూర్తి చేసింది.

భరత్ రెడ్డి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు భరత్ రెడ్డి. గగనం, అత్తారింటికి దారేది, యాక్షన్ లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ భరత్ ఓ ప్రొఫెషనల్ డాక్టర్. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కార్డియాలజీ స్పెషలిస్ట్ గా పనిచేశారు.

రాజశేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటుడిగా మారారనేది అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర్ ఎంబిబిఎస్ పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు చెన్నైలో డాక్టర్ గా పనిచేసారు కూడా. నటుడిగా మారాక రాజశేఖర్ ఎంతటి క్రేజ్ తెచుకున్నారో అందరికీ తెలిసిందే.

అల్లు రామలింగయ్య

లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య డాక్టర్ ఏంటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. ఆయన ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లొకి వచ్చి నవ్వులు పూయించారు.

సౌందర్య

దివంగత నటి సౌందర్య డాక్టర్ కాదు.. కానీ ఆమె ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో డిస్కంటిన్యూ అయ్యారు. అప్పుడే సినిమాల్లో అవకాశాలు రావడంతో చదువుని మధ్యలో వదిలిపెట్టాల్సి వచ్చింది. దాదాపు 100 చిత్రాల్లో దక్షణాది అభిమానులని అలరించిన సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.

ప్రభాకర్ రెడ్డి

లెజెండ్రీ నటుడు ప్రభాకర్ రెడ్డి కూడా డాక్టరే. 1960లో ప్రభాకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో తన వృత్తిని వదిలిపెట్టి ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి లాంటి స్టార్స్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.