close
Choose your channels

వారెవా.. కిరాక్ అనిపించేలా అల్లు శిరీష్ న్యూలుక్ వైరల్

Friday, May 21, 2021 • తెలుగు Comments

హీరో అల్లు శిరీష్ మంచి హిట్ కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. శిరీష్ కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. తన తర్వాతి చిత్రాల కోసం శిరీష్ హార్డ్ వర్క్ పెంచాడు. వెండితెరపై ప్రత్యేకత చాటుకుంటే ఇప్పటి ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

అందుకే శిరీష్ కూడా నార్మల్ లుక్ లో కనిపిస్తే లాభం లేదని మేకోవర్ మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. గత కొన్ని నెలలుగా శిరీష్ తన లుక్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫలితం కనిపిస్తోంది. శిరీష్ లేటెస్ట్ లుక్ షాకిచ్చే విధంగా ఉంది.

తాజాగా శిరీష్ కండలు తిరిగిన శరీరంతో ఉన్న సెల్ఫీ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీ కేక పెట్టించేలా ఉంది . ఈ లుక్ తన తదుపరి చిత్రం కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ విజేత దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇక శిరీష్ తదుపరి మూవీ ప్రకటన మే 30న జరగనుంది. ఆ రోజు శిరీష్ బర్త్ డే. దర్శకుడు ఎవరు, ఎలాంటి కథతో రాబోతున్నారు ఇలా అన్ని వివరాలు ఆరోజే తెలియనున్నాయి.

శిరీష్ చివరగా నటించిన చిత్రం ఏబీసీడీ. ఆ మూవీ నిరాశపరచడంతో శిరీష్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz