50 రోజులు పూర్తి చేసుకున్న శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు..!

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అల్లు శిరీష్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది.

ఇక క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రం నైజాం 2,64,00,000, సీడెడ్ 1,35,00,000, కృష్ణా 81,00,000, గుంటూరు 83,00,000, వెస్ట్ 70,00,000, ఈస్ట్ 77,00,000, వైజాగ్ 1,65,00,000, నెల్లూరు 31,00,000, క‌ర్నాట‌క & ఓవ‌ర్ సీస్ మొత్తం క‌లిపి 10,02,00,000 షేర్, 20.02 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ట్టు ట్రేడ్ విశ్లేష‌కులు తెలియ‌చేసారు.

More News

చిరు - వినాయ‌క్ ల‌ ఠాగూర్ కు 13 ఏళ్లు..!

మెగాస్టార్ చిరంజీవి - డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ ఠాగూర్. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రియ‌, జ్యోతిక న‌టించారు.

శ‌ర్వానంద్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు..!

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలో న‌టిస్తున్నారు.

టైటిల్ కి త‌గ్గ‌ట్టు హై ప‌వ‌ర్ చూపించిన రామ్..!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టించింది.

ప‌వ‌న్ త‌మ్ముడుగా క‌మ‌ల్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `కాట‌మ‌రాయుడు` సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ ద‌ర్శ‌కుడు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థ‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తాగ్యారేజ్ స‌క్సెస్ వెంట‌నే సినిమాను స్టార్ట్ చేయ‌కుండా కాస్తా గ్యాప్ తీసుకున్నాడు. నెక్ట్స్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది.