close
Choose your channels

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

Thursday, May 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా.. 'రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్' ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఛాలెంజ్ పుస్తకపఠనం వ్యవహారానికి సంబంధించినది. రామ్ ప్రసాద్ అనే ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో అక్కినేని అమలకు ఛాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్‌ను అంగీకరించిన అమల.. తన కోడలు సమంత, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనను నామినేట్ చేశారు. అంతేకాదు.. తాను ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తూ.. ‘స్టోరీస్ ఎట్ వర్క్’ అనే బుక్‌ను చదువుతానని ట్విట్టర్‌లో ఆమె స్పష్టం చేశారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.