రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌... ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Friday,March 20 2020]

కేర‌ళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ త‌న ప్రియుడు, సింగ‌ర్ భ‌వ్నీంద‌ర్ అడైను వివాహ‌మాడింది. గ‌త కొన్ని రోజుల ముందు నుండి వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోల‌ను చూసిన నెటిజన్స్ వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని అనుకున్నారు. అయితే అమ‌లాపాల్ భ‌వ్నీంద‌ర్ త‌న ప్రేమికుడ‌ని, త‌న‌ని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కానీ చెప్పలేదు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఫొటోల్లో క‌న‌ప‌డుతున్న ఇన్‌టిమ‌సీని బ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ సాగుతుంద‌ని అనుకున్నారు. అందుకు త‌గిన‌ట్లే అమ‌లాల‌పాల్ గ‌త చిత్రం ఆమె విడుద‌ల‌కు ముందు భ‌వ్నేంద‌ర్ అమ‌లాపాల్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నానంటూ సోష‌ల్‌మీడియాలో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అయితే ఏం చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఉహ‌లుగా మాత్ర‌మే మిగిలి పోయాయి. నెటిజ‌న్స్ ఊహ‌ల‌ను వీరిద్ద‌రూ నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు.

ఇంత‌కు ముందు అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. గ‌త ఏడాది విజ‌య్ ఓ లేడీ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ డైరెక్ట‌ర్ విజ‌య్ మాత్రం నోరు మెదప‌లేదు. ఇప్పుడు అమ‌లాపాల్ పెళ్లి చేసుకుంది.

More News

బ్రేకింగ్: తెలంగాణలో ‘పది’ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ఇటీవలే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అంతా కరోనా నేపథ్యంలో బంద్‌లో ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు..

బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా

బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరగనుంది. అయితే.. బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా చేసేశారు.

యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు.

దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున

శ్రీవారి భక్తులారా సహకరించండి : టీటీడీ ఈవో

‘కరోనా’ మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో