close
Choose your channels

`జెర్సీ` రీమేక్‌లో అమలాపాల్

Monday, August 12, 2019 • తెలుగు Comments

`జెర్సీ` రీమేక్‌లో అమలాపాల్

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన తెలుగు చిత్రం `జెర్సీ` మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని ఇటు కోలీవుడ్.. అటు బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. కోలీవుడ్ విషయానికి వస్తే.. విష్ణు విశాల్ హీరోగా `జెర్సీ` రీమేక్ కానుందని వార్తలు వినపడుతున్నాయి. 

క్రికెట్ టచ్ బాగా ఉండటంతో విష్ణు విశాల్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రను తమిళంలో అమలాపాల్ చేయనుందని టాక్. ఒకవేళ నిజంగానే అమలాపాల్ నటిస్తే మాత్రం వీరిద్దరూ `రాక్షసన్` తర్వాత జంటగా నటించే చిత్రమిదే అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz