close
Choose your channels

మ‌ళ్లీ సైన్ చేసిన అమ‌ల‌

Saturday, June 15, 2019 • తెలుగు Comments

మ‌ళ్లీ సైన్ చేసిన అమ‌ల‌

అమ‌ల తాజాగా మ‌రో సినిమాకు సైన్ చేశారు. అంత‌ర్జాతీయంగా పాకుతున్న ఓ స‌మ‌స్య‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. ఇందులో ఆమెతో పాటు విదేశీ న‌టి మ‌రొక‌రు క‌నిపిస్తారు. హీరో విజ‌య్ సేతుప‌తి మాత్రం సంగీత కారుడిగా క‌నిపిస్తారు. త‌మిళ్‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన విజ‌య్‌కి ఇది 33వ సినిమా. ఆయ‌న‌తో అమ‌లాపాల్ జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి.

ప‌డ‌టం కాదు... లేవ‌డం ప్ర‌ధానం అని న‌మ్మే అమ‌ల విడాకుల త‌ర్వాత మ‌రింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌ని మెయింటెయిన్ చేస్తూ, మిగిలిన హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ వంటి యువ క‌థానాయకుల చిత్రాల్లో న‌టించిన అమ‌లాపాల్ త్వ‌ర‌లోనే మ‌రో భారీ ప్రాజెక్ట్ గురించి వెల్ల‌డించ‌నున్నార‌ని కోడంబాక్కం టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz