మళ్లీ సైన్ చేసిన అమల
Send us your feedback to audioarticles@vaarta.com
అమల తాజాగా మరో సినిమాకు సైన్ చేశారు. అంతర్జాతీయంగా పాకుతున్న ఓ సమస్యను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో ఆమెతో పాటు విదేశీ నటి మరొకరు కనిపిస్తారు. హీరో విజయ్ సేతుపతి మాత్రం సంగీత కారుడిగా కనిపిస్తారు. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన విజయ్‌కి ఇది 33వ సినిమా. ఆయనతో అమలాపాల్ జోడీ కట్టడం ఇదే తొలిసారి.
పడటం కాదు... లేవడం ప్రధానం అని నమ్మే అమల విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌ని మెయింటెయిన్ చేస్తూ, మిగిలిన హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.
తెలుగులో రామ్‌చరణ్ వంటి యువ కథానాయకుల చిత్రాల్లో నటించిన అమలాపాల్ త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్ గురించి వెల్లడించనున్నారని కోడంబాక్కం టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.