close
Choose your channels

నవంబర్ 10 న 'అమర్ అక్బర్ ఆంటోనీ ' ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల

Monday, November 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నవంబర్ 10 న అమర్ అక్బర్ ఆంటోనీ  ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ '..నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు..

రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.