సింగపూర్‌లో చికిత్స పొందుతూ అమర్ సింగ్ మృతి

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్(64) మృతి చెందారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఇటీవలే ఆయనకు కిడ్నీ మార్పిడి సైతం జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడుతోందనుకున్న సమయంలో ఒక్కసారిగా పూర్తిగా క్షీణించి శనివారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌కు అమర్ సింగ్ అత్యంత సన్నిహితుడు. సమాజ్‌వాదీ పార్టీలో రెండవ స్థానంలో కొనసాగుతున్న అమర్‌సింగ్ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ పటిష్టానికి ఆయన కృషి శ్లాఘనీయం. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అను ఒప్పంద విషయంలో సమాజ్‌‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలోనూ అమర్‌సింగ్ కీలకంగా వ్యవహరించారు.

అటు కాంగ్రెస్ పార్టీతోనూ ఇటు వ్యాపారం, సినిమా అంటూ అన్ని రంగాల వారితోనూ అమర్‌సింగ్‌కి సన్నిహిత సంబంధాలుండేవి. కాగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా 2010లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్‌ను ములాయం బహిష్కరించారు. దీంతో ఆయన 2011లో రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అయితే 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా ఆయన పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. కాగా.. 2016లో తనను బహిష్కరించిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతోనే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం విశేషం. 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు అమర్‌సింగ్ ఎన్నికయ్యారు.

More News

‘వకీల్‌సాబ్‌’కు డేట్స్ కేటాయించిన శృతి..!

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న దిల్‌రాజు

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!..ఇది అక్కినేని నాగార్జున అభిమానుల‌కే కాదు.. సినీ ప్రియుల‌లంద‌రికీ శుభ‌వార్తే.

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త‌న కెరీర్‌ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) కరోనాతో మృతి చెందారు.