రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి తెరలేచింది. మరికొన్ని గంటల్లో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పనుల్ని ప్రారంభించబోతున్నారు.
మోదీ పర్యటన కోసం సకల ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో దాదాపు 49వేల కోట్ల రూపాయల పనుల్ని ప్రధాని ప్రారంభించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెదేపా కీలక భాగస్వామిగా ఉండటంతో.. అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీలను ఒప్పించి ఆఘమేఘాలపై రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కో మరో రూ.11 వేల కోట్ల రుణం మంజూరు చేసింది.
సరిగ్గా పదేళ్ల కిందట, 2015, అక్టోబర్ 22న రాజధాన అమరావతి శంకుస్థాపనకు వచ్చారు ప్రధాని. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత జగన్ సర్కారు రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి పునర్నిర్మాణ పనుల్ని మరోసారి ప్రారంభించబోతున్నారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు ఏక కాలంలో మొదలయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. 77,250 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. వీటిలో 49వేల కోట్ల రూపాయల పనులు ఈరోజే మొదలుకానున్నాయి. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com