అమరావతి రీస్టార్ట్.. ప్రకటించిన ప్రధాని


Send us your feedback to audioarticles@vaarta.com


’రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునఃప్రారంభ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
రూ.49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. మొత్తం 57,962 కోట్లు విలువ గల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం ఇచ్చారు.
అమరావతిలో రూ.49,040 కోట్లతో 74 ప్రాజెక్టు పనులకు అదనంగా రూ.5028 కోట్లతో చేపట్టే 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.3680 కోట్లతో నిర్మాణం పూర్తైన 8 జాతీయ రహదారుల ప్రారంభించారు. మరో రూ.254 కోట్లతో నిర్మించిన మూడు రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు.
రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కొన్ని ప్రాజెక్టుల వివరాలు:
- రూ.1459 కోట్లతో నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం
- రూ.100 కోట్లతో విశాఖలో డీపీఐఐటీ చేపట్టే యూనిటీ మాల్ కు శ్రీకారం
- రూ.293 కోట్లతో గుంతకల్- వెస్ట్-మల్లప్ప గేట్ ఆర్‌యూబీ నిర్మాణం
- రూ. 3,716 కోట్లతో 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments