అమెజాన్ బ్లండర్ మిస్టేక్.. పండగ చేసుకున్న కస్టమర్స్!

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ చిన్నపొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ చిన్నపాటి తప్పిదం వల్ల అమెజాన్ లక్షలాది రూపాయలు నష్టపోగా.. మరోవైపు వినియోగదారులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల నిర్వహించిన ప్రైమ్ డే సేల్‌లో ఈ తప్పిదం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తుంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఎంత విక్రయించినా ఓ 40, 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా.. జూలై 15, 16న అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరిగింది. ఈ-కామర్స్ దిగ్గజం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ 'ప్రైమ్ డే సేల్'లో ఓ పెద్ద పొరపాటు జరిగింది. కొనుగోలు ధర పేర్కొనాల్సిన చోట అంకెల్లో జరిగిన పొరబాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీని ఫలితమే రూ.9 లక్షల విలువైన బ్రాండెడ్ కెమెరాను కేవలం రూ.6,500 మాత్రమే కస్టమర్లు ఎగరేసుకెళ్లారు.

కంగుతిన్న అమెజాన్..!

ఈ విషయం ఎంతకీ అమెజాన్ తెలుసుకోలేకపోయింది. పలువురు తాము అత్యంత తక్కువ ధరకే కొన్న కెమెరాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టారు. వీటిని చూసిన అమెజాన్ చూసి కంగుతిన్నది. అసలేం జరిగిందా అని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే భారీ సంఖ్యలో ఖరీదైన కెమెరాలకు రెక్కలొచ్చి కస్టమర్ల దగ్గరికి ఎగిరిపోయాయ్. అంతేకాదు రేటు తక్కువ కదా అని ఒక్కొక్కరు ఐదారు ఆర్డర్లు చేశారు. మరోవైపు.. అమెజాన్ వాటిని కస్టమర్లకు డెలివరీ కూడా చేసేసింది. దీంతో చేసేదేమీలేక అప్పటికి బుక్ అయిన ఆర్డర్లను మాత్రం రద్దు చేసిన అమెజాన్ ఉసూరుమంది. సో.. చిన్న పొరపాటుకు ఒక్కోసారి ఎలాంటి తప్పిదం జరుగుతుందో ఈ దెబ్బతో అమెజాన్ బాగానే తెలిసొచ్చిందన్న మాట. అయితే ఈ వ్యవహారంలో అమెజాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? డెలీవరి అయిన కెమెరాల విషయంలో ఎలా ముందుకెళ్తుంది..? ఇప్పటి వరకు రద్దు చేసిన ఆర్డర్స్ ఓకే..? మరి డెలివరీ అయిన వాటి సంగతేంటి..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

More News

తెలంగాణ ప్రజలకు బోనాల గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అనుష్క 'నిశ్శబ్దం' ప్రచార చిత్రం  విడుదల

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి  క్రాస్ ఓవ‌ర్ చిత్రం  ''నిశ్శబ్దం'.

మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌(81) తుదిశ్వాస విడిచారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం 'రణరంగం'  లోని 'కన్నుకొట్టి'  పాట విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

'ఉత్త‌ర' ట్రైల‌ర్ లాంచ్

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్  క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’.  శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు  తిరుపతి యస్ ఆర్.