ఏఎంబీ సినిమాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు

  • IndiaGlitz, [Thursday,April 15 2021]

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లో స్టార్ హీరోగా రాణిస్తూనే.. ఇటు వ్యాపారం రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సహకారంతో మరోవైపు నిర్మాణ రంగంలోనూ మహేష్ అడుగు పెట్టారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి తను హీరోగా నటిస్తున్న సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే యంగ్ టాలెంట్‌తో మేజర్ వంటి సినిమాలను నిర్మిస్తున్నాడు. మరోవైపు మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ప్రారంభించించాడు.

ఈ ఏఎంబీ సినిమాకు ప్రస్తుతం ఓ అరుదైన గుర్తింపు లభించింది. 'ఇనవేషన్ అవార్డ్స్-2021'లో గ్లోబల్ గుర్తింపును పొందింది. ఇనవేషన్ అవార్డ్స్-2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికవడం విశేషం. భారతదేశం నుంచి ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌ని మాత్రమే ఏవీ ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఎంపి చేసినట్టు సమాచారం. ఏఎంబీ సినిమాస్‌కు ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా ఏఎంబీ సినిమాస్ బృందానికి అభినందనలు తెలిపారు.

నిజానికి ఏఎంబీ సినిమాస్ ఒక అద్భుతమనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమనిపించే ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలతో ‘ఏఎంబీ సినిమాస్' ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని కలిగిస్తోంది. దీంతో ఏఎంబీ సినిమాస్‌కు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రస్తుతం పలువురు సెలబ్రిటీలు సైతం మల్టీప్లెక్స్ నిర్మాణం వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.

More News

'నార‌ప్ప' చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

ఫస్ట్ ఈ ప్రాజెక్టులో నేను లేను: ‘మేజర్’ దర్శకుడు

‘గూఢచారి’గా ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడవి శేష్.. ప్రస్తుతం ‘మేజర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

అడవి శేష్ ‘మేజర్’ టీజర్ అదిరిపోయింది..

‘గూఢచారి’,‘ఎవరు’ చిత్రాల తర్వాత హీరోగా అడవి శేష్‌కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు ఫైట్లు, నాలుగు డ్యూయెట్లు వంటి రొటీన్ రొమాంటిక్ మూవీస్‌కి స్వస్తి పలికి..

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యువ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు.

‘వకీల్ సాబ్’ను అడ్డుకునే వ్యక్తి కాదు జగన్: నాగబాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు జనసేన అధినేత కూడా. అయితే ఆయన రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే రిసోర్సెస్ కావాలని..