నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ అంతే.. తప్పేముంది!?

  • IndiaGlitz, [Friday,January 31 2020]

జనసేనకు గుండెకాయ లాంటి నేతగా పేరుగాంచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేస్తారని కానీ.. రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తారని బహుశా పవన్, కార్యకర్తలు ఊహించి ఉండరేమో.! ఆయన వ్యాఖ్యలతో కార్యకర్తలు హర్ట్ అయ్యారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత, బీజేపీ నేత అంబికాకృష్ణ స్పందించారు. లక్ష్మీనారాయణ ఎత్తిచూపిన కారణం సహేతుకంగా లేదన్నారు.

తప్పేముంది!?

‘వృత్తిని కొనసాగిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుంది..?. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేయలేదా? ఎందుకంటే అదే వారి వృత్తి. ఆ వృత్తిలో ఎదిగే జనాల ముందుకు రాగలిగారు. పవన్ మరిన్ని సినిమాల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలేవీ పట్టించుకోవద్దు. పవన్ గారు మీరు చక్కగా సినిమాల్లో నటించండి. అటు ప్రజా సేవ కూడా చేయండి. మీకెప్పుడూ మేం అండగా ఉంటాం’ అని అంబికా చెప్పుకొచ్చారు.

More News

కళ్లార్పలేనంత థ్రిల్.. ‘హిట్’ పక్కానేమో!?

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా

మరోసారి డ్యూయెల్ రోల్‌లో ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

సీరియస్ ప్లానింగ్‌లో అల్లు అర‌వింద్‌?

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ సినీ రంగంతో పాటు రీసెంట్‌గా  డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

పవన్ కు షాక్ .. జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. జేడీ ఎస్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న 'మైదాన్'

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.