close
Choose your channels

పవన్‌‌కు కలిసిన అమెరికన్ కాన్సులేట్ జనరల్

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్‌‌కు కలిసిన అమెరికన్ కాన్సులేట్ జనరల్

జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌‌‌ను అమెరికన్ కాన్సులేట్ జనరల్-హైదరాబాద్ కేథరిన్ హడ్డా కలిశారు. మంగళవారం సాయంత్రం కేథరిన్ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి పవన్ సాదారంగా ఆహ్వానించారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాల చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల అమెరికాలో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థుల గురించి చర్చించారని సమాచారం. కాగా ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. గత కొన్ని రోజులుగా కేథరిన్ పార్టీ అధినేతలతో వరుస భేటీలు అవుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డితో ఇదివరకే అమెరికన్ కాన్సులేట్ భేటీ అయ్యారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్‌‌ అయిన సమయంలో ఈమె భేటీ అయ్యారు. అయితే ఈమె వరుసగా పార్టీల అధినేతలతో ఎందుకు భేటీ అవుతున్నారన్న విషయం తెలియరాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.