close
Choose your channels

సింగిల్ సాంగ్‌తో వావ్ అనిపించిన అమెరికా కోయిలలు

Tuesday, April 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సింగిల్ సాంగ్‌తో వావ్ అనిపించిన అమెరికా కోయిలలు

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నోళ్లు దునియానే ఏలొచ్చు.. అనేది అక్షర సత్యం. ఇలా తమ సొంత టాలెంట్‌తో గల్లీ నుంచి ఢిల్లీ మీదుగా ప్రపంచానికి తమ సత్తా చాటి చెప్పిన వాళ్లు కోకొల్లలు. ఇందుకు చక్కటి ఉదాహరణ సింగర్ బేబీ.. ఎక్కడో మారుమూల పల్లెటూరుకు చెందిన ఈమె సోషల్ మీడియాతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్‌గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. పల్లెకోయిల బేబమ్మ స్వరం ఆమె తల రాతనే కాదు.. కుటుంబ సభ్యుల జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు బేబీ పేరు అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో మారుమోగుతోంది. ఈమె కాల్ షీట్ల కోసం, సెల్ఫీల కోసం జనాలు క్యూ కడుతున్నారంటే ఏ రేంజ్‌కు ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. పల్లెకోయిలను స్పూర్తిగా తీసుకుని పలువురు తమ టాలెంట్‌‌ను సోషల్ మీడియా వేదికగా చూపుతున్నారు.

మొన్న పల్లెకోయిల.. ఇప్పుడు అమెరికా కోయిలలు

ఇక విషయానికొస్తే.. పల్లెకోయిల లాగే ‘47 డేస్’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ద్వారా అమెరికా కోయిలలు పరిచయం అవుతున్నారు. నీహా కుదివేటి, ప్రీతి కేశన్ ఇద్దరూ ‘క్యా కరూ.. క్యా కరూ ఆ నవ్వు చూస్తే మాట రాదు క్యా కరూ’ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ ఇద్దరి వాయిస్ అద్భుతంగా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీహా, ప్రీతిని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచే టాలీవుడ్‌కు పరిచయం చేశారు. మొదటి సాంగ్‌తోనే ఈ అమెరికా కోయిలలు సంగీత ప్రియుల మనసులు దోచుకున్నారని చెప్పుకోవచ్చు. కాగా ఈ పాటలో సంగీతం కూడా అద్భుతంగా ఉండటంతో.. సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి.. అవకాశాలు కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. హీరో సత్యదేవ్‌, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్‌ ప్రధాన పాత్రల్లో.. ప్రదీప్‌ మద్దాలి తెరకెక్కించిన చిత్రం '47 డేస్‌'. ఈ చిత్రానికి 'ది మిస్టరీ అన్‌ ఫోల్డ్స్‌' అనేది ఉపశీర్షిక. ప్రదీప్ మద్దాలి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదల ట్రైలర్ మంచి టాక్ సంపాదించుకుంది. మే-10న ‘47 డేస్’ థియేటర్లలోకి రానుంది.

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.