అమితాబ్‌జీ ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో గతంలో జరిగిన విషయాలను సైతం ఆయన ప్రస్తావించారు. ‘‘గౌరవనీయులైన అమితాబ్ బచ్చన్ గారు.. మీరు ‘కూలి’ షూట్‌లో గాయపడినప్పుడు మా అమ్మ, నాన్న సహా మా కుటుంబం మొత్తం మీరు బాగుండాలని ప్రార్థించిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. మీలోని టాలెంట్‌నే కాదు.. ఫైటింగ్ స్పిరిట్, సింప్లిసిటి, వినమ్రతను మేము చాలా ఇష్ట పడతాం. మీకు, అభిషేక్‌కు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. ‘లార్డ్ ధన్వంతరి’ మిమ్మల్ని, అభిషేక్‌ని మిమ్మల్ని తన వైద్య శక్తితో నయం చేసి.. కోలుకునేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అని పవన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అమితాబ్‌ను పవన్ ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా అమితాబ్‌ను కలిసేందుకు పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నేడు పవన్ ట్వీట్‌లో సైతం.. ‘మీ అభిమాని.. ఆరాధకుడు.. పవన్ కల్యాణ్’ అని పేర్కొనడం అమితాబ్‌పై ఆయనకున్న గౌరవానికి నిదర్శనం.

More News

పవన్ ‘తొలిప్రేమ’ను టార్గెట్ చేస్తున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో శనివారం గణనీయంగా తగ్గిన కేసులు...

తెలంగాణలో శనివారం కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. కొద్ది రోజులుగా 5వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తేనే..

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కుటుంబం ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తోంది.

అమితాబ్‌కు కరోనా అని తేలడంతో చిరు, మహేష్, సచిన్ ట్వీట్లు

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే.

అభిషేక్‌, ఐశ్వర్య, జయాబచ్చన్‌ల కరోనా ఫలితమిదే...

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపింది.