close
Choose your channels

అమ్మో.. రాజశేఖర్..

Tuesday, October 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మో.. రాజశేఖర్..

ఇవాళ నామినేషన్స్ పర్వం నడిచింది. అమ్మ రాజశేఖర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. నామినేట్ చేయడానికి కారణాలను వెదుక్కుని మరీ రచ్చ రచ్చ చేసేశారు. షో స్టార్టింగే అభి బట్టలను బిగ్‌బాస్ తిరిగి పంపించేశారు. నెక్ట్స్ డే మెగాస్టార్ సాంగ్‌తో డే స్టార్ట్ అయింది. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా.. హౌస్‌మేట్స్ ఒకరి గురించి మరొకరు.. పాజిటివ్, నెగిటివ్స్ రాయాలి. అఖిల్.. అభి గురించి రాశాడు. అభిజిత్ నువ్వు అఖిల్‌తో మాట్లాడుతున్నప్పుడు చాలా గుడ్ లుకింగ్‌గా ఉంటావు. డైటింగ్ ఆపేసి తినడం మొదలు పెట్టు అని రాశాడు. ఇక మెహబూబ్ గురించి మోనాల్ రాసింది. టాస్క్‌ల్లో బాగా చేస్తావని చెప్పింది. వీరిద్దరి గురించి మాత్రమే చెప్పారు. ఇక అవినాష్, లాస్య, అరియానా మోనాల్ హౌస్‌లో్ బతుకమ్మ ఆడారు. నోయెల్.. మోనాల్ కిచెన్‌లో మాట్లాడిన విషయాలను అభి, లాస్య, హారికలకు వివరించాడు. నోయెల్ కూడా గాసిప్ కింగ్‌లా తయారవుతున్నాడు.

తరువాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఏ సభ్యుడి కారణంగా బిగ్‌బాస్ ఇంటి ప్రయాణం కష్టంగా సాగిందో... మున్ముందు ఇబ్బంది అవుతుందో కారణాలు చెప్పి సదరు ఇంటి సభ్యులలో ఇద్దరిని చొప్పున ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. లాస్య నామినేషన్స్‌ను స్టార్ట్ చేసింది. అమ్మ.. తనను కన్నింగ్ స్మైల్ అన్నారని ఆయనను నామినేట్ చేసింది. రెండో వ్యక్తి మోనాల్‌ను లాస్య నామినేట్ చేసింది. నెక్ట్స్ వచ్చిన అఖిల్.. ముందుగా అరియానాను నామినేట్ చేశాడు. తరువాత అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు. ఎప్పుడూ సింపతి అంటుంటారని కాబట్టి ఆ వర్డ్ నచ్చలేదని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. తరువాత వచ్చిన మెహబూబ్.. అరియానాను నామినేట్ చేశాడు. తరువాత మోనాల్‌ను నామినేట్ చేశాడు.

అమ్మో.. రాజశేఖర్..

తరువాత వచ్చిన అవినాష్.. లాస్యను నామినేట్ చేశాడు. ఈ నేపథ్యంలో అవినాష్, లాస్యల మధ్య చిన్నపాటి చర్చ జరిగింది. నాకు టీ ఇవ్వలేదని అవినాష్.. లాస్యను నామినేట్ చేయడం చాలా సిల్లీగా అనిపించింది. తరువాత అవినాష్.. హారికను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా హారిక.. అఖిల్ పేరు తీసింది. ఈ టైమ్‌లో చిన్నపాటి చర్చ జరిగింది. నెక్ట్స్ వచ్చిన అమ్మ రాజశేఖర్.. అఖిల్‌ను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా అభి, మోనాల్, అఖిల్‌ల నేమ్స్ తీశారు. అభి.. మోనాల్‌తో మాట్లాడటం లేదని.. అఖిల్ మాత్రం మాట్లాడుతున్నాడని.. ఏవేవో కారణాలు చెప్పారు. ఆ ముగ్గురు పేర్లు తీసి నామినేట్ చేయడమేంటో తెలియలేదు. అమ్మాయి పేరు తేవద్దని నాగ్.. చెబితే అమ్మ రాజశేఖర్ తీసుకురావడం చాలా సిల్లీగా అనిపించింది. కుమార్ విషయంలో అఖిల్.. యాటిట్యూడ్ చూపించాడని ఇంకా ఏవేవో అనడంతో అఖిల్ బాగా ఫైర్ అయ్యాడు. వీరిద్దరి గొడవలో అమ్మ రాజశేఖర్ మాటలు చాలా సిల్లీగా అనిపించాయి. ఎప్పుడూ అమ్మ రాజశేఖర్‌ను ఎవరైనా అప్పోజ్ చేసినా.. నామినేట్ చేసినా తీసుకోలేరు. ఈ సందర్భంగా బాగా మాటలు వదిలేస్తారు. ఇవాళ కూడా అదే జరిగింది. అఖిల్‌ని నామినేట్ చేయడానికి చాలా సిల్లీ రీజన్స్ అయితే వెదుక్కున్నారు. తరువాత తనను నామినేట్ చేసిన లాస్యనే అమ్మ నామినేట్ చేశారు.

తరువాత వచ్చిన అరియానా.. మెహబూబ్‌ని నామినేట్ చేసింది. తరువాత అఖిల్‌ను నామినేట్ చేసింది. తరువాత వచ్చిన సొహైల్.. అరియానాను నామినేట్ చేశాడు. తరువాత అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు. యాంగ్రీ యంగ్ మాన్ సొహైల్ కాస్తా.. నామినేట్ చేసేటప్పుడు కూడా ఫన్నీ యంగ్ మాన్ అయిపోయాడు. తరువాత వచ్చిన నోయెల్.. స్ట్రాంగ్ పీపుల్‌ని నామినేట్ చేస్తున్నానంటూ మెహబూబ్‌, అఖిల్‌ని నామినేట్ చేశాడు. తరువాత వచ్చిన అఖిల్.. మోనాల్‌ను నామినేట్ చేశాడు. తనకు అబద్ధాలు చెప్పవద్దని నామినేట్ చేశాడు. నన్ను మానిప్యులేటర్ అనేదుంటే వచ్చి నాకే చెప్పు.. అని అభి చెప్పాడు. 8వ వారం నిన్ను నామినేట్ చేయాల్సి వస్తోందని.. ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుందని భావించలేదని అభి చెప్పాడు. ఇక తరువాత అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు. తరువాత హారిక.. అరియానాను నామినేట్ చేసింది. తరువాత మెహబూబ్‌ని నామినేట్ చేసింది. తరువాత వచ్చిన మోనాల్.. మెహబూబ్‌ని నామినేట్ చేసింది. తరువాత లాస్యను నామినేట్ చేసింది. మొత్తమ్మీద ఇవాళ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌లు నామినేట్ అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.