'అమ్మ‌మ్మ‌గారిల్లు' 'చాలా చాలా' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్  స‌హ నిర్మాత‌గా రాజేష్  నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ళ్యాణ ర‌మ‌ణ సంగీతం అదించారు. కాగా ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య  మ్యూజిక్ ద‌క్కించుకుంది.

ఈ సినిమాలోని భాస్క‌ర భ‌ట్ల రచించిన 'చాలా చాలా' అంటూ సాగే లిరిక‌ల్ వీడియో పాట‌ను ఆదివారం ఉద‌యం ఆదిత్య మ్యూజిక్ ద్వారా  రిలీజ్ చేస్తున్నారు. క‌ళ్యాణ ర‌మ‌ణ‌, గీతామాధురి ఈ పాట‌ను ఆల‌పించారు. అలాగే నైజాం ఏరియాలో హ‌క్కుల్ని  గ్లోబ‌ల్ సినిమాస్ ఎల్. ఎల్. పి  సంస్థ అధినేత ఏషియ‌న్ సునీల్  ఫ్యాన్సీ ధ‌ర‌కు చేజిక్కించుకుని రిలీజ్  చేస్తున్నారు. అన్ని ప‌నుల పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఇదేనెల‌లో రిలీజ్ అవుతుంది.

ఇత‌ర పాత్ర‌ల్లో రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్, సుమిత్ర‌, సుధ‌, హేమ, ఏడిద శ్రీరామ్, ర‌విప్ర‌కాష్, చ‌ల‌ప‌తిరావు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్:  సాయి కార్తిక్, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్, పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి, ఎడిటింగ్:  జె.పి, పీఆర్.ఓ:  సురేష్ కొండేటి,  కొరియోగ్ర‌ఫీ: స‌్వ‌ర్ణ‌, ఫైట్స్: మ‌ల్లేష్ షావెలెన్, స‌హ నిర్మాత‌:  కె.ఆర్, నిర్మాత‌:  రాజేష్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  సుంద‌ర్ సూర్య‌.

More News

'సమ్మోహనం' ఆ సినిమాకి స్ఫూర్తినా?

యువ కథానాయకుడు సుధీర్ బాబు, బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం ‘సమ్మోహనం’.

భారీ యాక్ష‌న్ సీన్ పూర్తిచేసిన చ‌ర‌ణ్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

న్యూయార్క్‌, క‌ర్నూల్ నేప‌థ్యంలో మ‌హేష్ 25వ చిత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌ను హ్యాట్రిక్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

రానాతో రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో..

క‌థానాయ‌కుడిగానూ, ప్ర‌తినాయ‌కుడిగానూ మెప్పించిన యువ న‌టుడు రానా.

ఒక పాట మిన‌హా పూర్త‌యిన సుమంత్ చిత్రం

మ‌ళ్ళీ రావా చిత్రంతో చాలా కాలం త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు క‌థానాయ‌కుడు సుమంత్‌.