close
Choose your channels

'అమ్మ‌మ్మ‌గారిల్లు' ప్రీ రిలీజ్ వేడుక‌

Thursday, May 24, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మ‌మ్మ‌గారిల్లు ప్రీ రిలీజ్ వేడుక‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హ నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మే 25న సినిమా విడుద‌ల‌వుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ బుధ‌వారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా ఆవిష్క‌రించారు. అలాగే తొలి సీడీని హీరో నాగ‌శౌర్య ఆవిష్క‌రించి అమ్మ‌మ్మ సావిత్రికి అంద‌జేసారు. అనంత‌రం...

నాగ‌శౌర్య మాట్లాడుతూ "'అమ్మ‌మ్మ‌గారిల్లు' చాలా మంచి సినిమా. రావు ర‌మేశ్‌గారు చాలా మంచి, మ‌న ఇంట్లో క‌న‌ప‌డే క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తారు. సుమిత్ర‌గారు అమ్మ‌మ్మ‌గారి పాత్ర‌కు అతికిన‌ట్లు స‌రిపోయారు. సుంద‌ర్‌గారు మంచి క‌థ చెప్ప‌డ‌మే కాదు.. చెప్పిన‌ట్లు తీశారు కూడా. మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాను తెర‌కెక్కించారు. మే 25న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా చూస్తే క‌చ్చితంగా అమ్మ‌మ్మ గుర్త‌కు వ‌స్తుంది.

రాజేశ్‌గారు, కుమార్‌గారు, సుంద‌ర్‌గారు ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ర‌సూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువ‌ల్స్‌తో చూపించారు. ఆయ‌న‌తో ఒక‌రికి ఒక‌రు లాంటి సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. షామిలి అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి ఇష్టం. త‌ను న‌టించిన సినిమాలు చూశాను" అన్నారు.

డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ - "ఎంతో మంది ఎక్స్‌పీరియెన్స్ ఉన్న న‌టీన‌టులు ఈ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డి చేశారు. అంద‌రూ చ‌క్క‌టి స‌హ‌కారం అందించారు. షామిలిగారిని అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పాను. ఆమెకు న‌చ్చ‌డంతో ఏ మాత్రం ఆలోచించ‌కుండా సినిమా చేస్తాను అన్నారు. నాగ‌శౌర్య‌గారు లేక‌పోతే ఈ సినిమా లేదు. రెండేళ్ల పాటు ఈ స్క్రిప్ట్‌ను త‌యారు చేశాం. హీరో నాగ‌శౌర్య‌ను క‌లిశాం. క‌థ విన‌గానే పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రం కాబ‌ట్టి ఏ మాత్రం ఆలోచించ‌కుండా చేస్తాన‌ని చెప్పారు.

అలాగే ర‌సూల్‌గారు మాట క‌న్నా ప‌నే ఎక్కువ మాట్లాడుతుంది. క‌ల్యాణ్‌మాలిక్‌గారు సినిమాలో రెండు సాంగ్స్ ఇచ్చారు. అలాగే సాయికార్తీక్‌గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ క్యాస్ట్ ప‌నిచేశారు. సాయికార్తీక్ అద్భుత‌మైన థీమ్ మ్యూజిక్ అందించారు. మా డైరెక్ష‌న్ టీం స‌హకారం ఉండ‌బ‌ట్టే సినిమాను అనుకున్న విధంగా చ‌క్క‌గా తెర‌కెక్కించాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు" అన్నారు.

నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ - "ఇంత మంచి సినిమా చేశామంటే కార‌ణం నాగ‌శౌర్య‌, షామిలి స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందించిన స‌హాయ‌మే. సినిమా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రికీ నచ్చుతుంది. మే 25న సినిమాను విడుద‌ల చేస్తున్నాం" అన్నారు.

స‌హ నిర్మాత కె.ఆ ర్ మాట్లాడుతూ, "నాగ‌శ శౌర్య గారు మా క‌థ ను న‌మ్మి సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న లేక‌పోతే ఈ సినిమా లేదు. మిగ‌తా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులో ఎంతో స‌హ‌క‌రించారు. అందువ‌ల్లే మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది" అని అన్నారు.

ఛాయాగ్రాహ‌కుడు ర‌సూల్ మాట్లాడుతూ, "ఇంత మంది ఆర్టిస్టుల‌తో సినిమా చేయ‌డం ఇదే మొద‌టిసారి. చాలా మంచి అనుభ‌వం ఇది. సినిమా ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. సుంద‌ర్ ప్ర‌తీ స‌న్నివేశాన్ని చెక్కారు. మా అమ్మమ్మ అమెరికాలో ఉంటారు. చూడ‌టం కుద‌ర‌దు ఆ అనుభుతిని మిస్ అవుతున్నా. కానీ ఈసినిమాతో అవ‌న్నీ దొరికాయి" అని అన్నారు.

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, "ఇంట్లో మా మ‌న‌వ‌రాలు అమ్మ‌మ్మ అంటూ మా ఆవిడ‌ను పిలుస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. తాత అనే పిలుపులే పెద్ద‌గా మాధుర్యం క‌నిపించ‌లేదు గానీ అమ్మ‌మ్మ పిలుపులో ఏదో తెలియ‌ని మాయ ఉంది. అలాంటి అమ్మమ్మ క‌థ‌తో ద‌ర్శ‌కుడు సినిమా చేసారు. చాలా బాగా వ‌చ్చింది. షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు అంతా ఓ చెట్టు కింద చేరి క‌లిసి భోజునాలు చేయ‌డం పాత రోజుల‌ను గుర్తు చేసాయి. అన్ని అనురాగాలు ఉన్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

హీరోయిన్ షామిలి మాట్లాడుతూ - "ఈ సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. మంచి సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య‌గారికి థాంక్స్‌. మంచి ఎన‌ర్జితో యూనిట్ స‌భ్యులంద‌రినీ మోటివేట్ చేస్తూ అందరి నుండి ప‌ని రాబ‌ట్టుకున్నారు. నిర్మాత‌లు కుమార్, రాజేశ్‌గారికి, నాగ‌శౌర్య‌కి థాంక్స్. మా అమ్మ‌మ్మ‌గారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావ‌ర‌ణాన్ని ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చూశాను" అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ - " 'అమ్మ‌మ్మ‌గారిల్లు' అనేది అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. సాయికార్తీక్ అంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల సంగీత ద‌ర్శ‌కుడ‌నే అంద‌రికీ గుర్తుంటుంది. కానీ న‌న్ను న‌మ్మి నాకు అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య‌, నిర్మాత రాజేశ్‌గారికి థాంక్స్‌. ఫుల్ లెంగ్త్ మెలోడీ మ్యూజిక్ అందించే అవ‌కాశం క‌లిగింది. సినిమాపై మంచి న‌మ్మ‌కం ఉంది. అంద‌రూ ఈ సినిమాను చూసి మా యూనిట్‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నాను" అన్నారు.

సీనియ‌ర్ న‌టి సుమిత్ర మాట్లాడుతూ, "నిర్మాత‌లిద్ద‌ర్ని చూస్తుంటే రామ‌-ల‌క్ష్మ‌ణ్ లా అనిపిస్తారు. చాలా ఫ్యాష‌న్ తో సినిమా చేసారు. అమ్మమ్మ పాత్ర‌లో న‌టంచ‌డం చాలా సంతోషిన్నిచ్చింది. ఇలాంటి పాత్ర‌లో న‌టిస్తే అన్ని ర‌కాల ఎమోష‌న్స్ చూడ‌గ‌లం. ఆ అదృష్టం నాకు ద‌క్కింది. సుంద‌ర్ చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంతా ఇష్ట‌ప‌డి ప‌నిచేసారు. అందువ‌ల్లే సినిమా ఇంత బాగా వ‌చ్చింది" అని అన్నారు.

మ‌ధుమ‌ణి మాట్లాడుతూ - "మా అమ్మమ్మ‌గారే మ‌మ్మ‌ల్ని పెంచి పెద్ద చేశారు. ఈ సినిమాను సినిమాగా భావించ‌లేదు. మాకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇది. సుమిత్ర‌, సుధ‌గారితో సంతోషం సినిమా త‌ర్వాత క‌లిసి న‌టించాను. శివాజీ రాజా మంచి స్నేహితుడు. రావు ర‌మేశ్‌గారి భార్య పాత్ర‌లో న‌టించాను. అంటే పెద్ద కోడలి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. అద్భుత‌మైన పాత్ర‌లు చేశాం. ఇంత మంచి సినిమా అవ‌కాశాన్ని ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్" అన్నారు.

హేమ మాట్లాడుతూ - "నేను 14 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చేశాను. కాబ‌ట్టి మా అమ్మ‌మ్మ‌గారిల్లు మిస్ అయ్యాన‌నే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాతో ఆ బాధ కొంత తీరింది. నాగ‌శౌర్య చ‌క్క‌గా న‌టించాడు. షామిలి మంచి పాత్ర‌లో న‌టించింది. వేస‌విలో అమ్మ‌మ్మ‌గారింటికి వెళదామ‌నుకునే ప్రేక్ష‌కులకు న‌చ్చే సినిమా అవుతుంది" అన్నారు.

న‌టుడు గౌతంరాజు మాట్లాడుతూ, "డైరెక్ట‌ర్ మంచి క‌థే రాసారు అనుకున్నా. క‌థ‌నాన్ని కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు. ప్ర‌తీ స‌న్నివేశం చాలా బాగా వ‌చ్చింది. సుంద‌ర్ మంచి రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్. నిర్మాత‌లు కూడా ఆయ‌న ఫ్యాష‌న్ ను అర్ధం చేసుకుని ఖ‌ర్చు కు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. నాగ‌శౌర్య ఈ సినిమాతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంటాడు" అని అన్నారు.

స‌మీర్ మాట్లాడుతూ, "నాగ‌శౌర్య నాకిష్ట‌మైన హ‌రో. చాలా స‌హ‌జంగా న‌టించ‌గ‌ల‌డు. మన‌వ‌డి పాత్ర‌లో ఒదిగిపోయాడు. సినిమా క‌చ్ఛితంగా పెద్ద విజయం సాధిస్తుంది" అని అన్నారు.

వేడుక అనంత‌రం హీరో నాగ‌శౌర్య‌ను ఆర్టీసి క్రాస్ రోడ్స్ అభిమానుల సంఘం ఘ‌నంగా పుల మాల‌తో స‌న్మానించింది. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాకు చెందిన యూనిట్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.