ట్రెడీష‌న‌ల్ గ‌ర్ల్‌గా అమీ జాక్స‌న్‌

  • IndiaGlitz, [Friday,November 13 2015]

ఎక్స్‌పోజింగ్‌కి ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌ని క‌థానాయిక‌ల్లో అమీ జాక్స‌న్ ఒక‌రు. పేరుకి విదేశీ సోయ‌గం అయినా.. ద‌క్షిణాది వారు ఆమెని అలా చూడ‌డం లేదు. ఇక్క‌డి అమ్మాయిగానే ట్రీట్ చేస్తున్నారు. అదే ఆమెకి క‌లిసి వ‌స్తోంది. అంతేకాదు.. అప్పుడ‌ప్పుడు డోర్ నెక్ట్స్ గ‌ర్ల్ పాత్ర‌లు ఆమెని వ‌రిస్తున్నాయి.

అలా వ‌చ్చిన ఓ అవ‌కాశ‌మే త‌మిళ చిత్రం 'గెత్తు'. ఉద‌య‌నిధి స్టాలిన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో.. అమీ త‌మిళ సంప్ర‌దాయ అయ్యంగారి అమ్మాయిగా క‌నిపించ‌నుంది. పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఆ పాత్ర‌లో అమీ అద‌ర‌గొట్టింద‌ని ఫిల్మ్ యూనిట్ చెప్పుకొస్తోంది. హేరిస్ జైరాజ్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 18న రిలీజ్ కానుంది.

More News

శ్రుతి హాస‌నా.. మ‌జాకా..

ఐరెన్‌లెగ్ బ్రాండ్ నుంచి గోల్డెన్ లెగ్ బ్రాండ్‌కి ట‌ర్న్ అయిన అందాల న‌టి శ్రుతి హాస‌న్ దూకుడు మాములుగా లేదు. ఈ సంవ‌త్స‌రంలో అయితే అమ్మ‌డు ఆడింది ఆట.. పాడింది పాట అన్న‌ట్లుగా ఉంది.

నాన్నపై కూతురు విజయం

కమల్ హాసన్ తనయలు శృతిహాసన్, అక్షర హాసన్ లు సినిమా రంగంలో రాణిస్తున్నారు. తండ్రితో ఇద్దరూ నటనలో పోటీపడుతున్నారు.

పాపం..చిరు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ ఇదిగో వచ్చేస్తుంది.డైరెక్టర్ వి.వి.వినాయక్.కత్తి రీమేక్ ఫిక్స్...ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

ప్రభాస్ పెళ్లి వార్తలపై క్రిష్ణంరాజు కామెంట్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి.

రజనీకాంత్ వర్సెస్ విజయ్?

ఈ దీపావళికి లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'తూంగానగరం',తల అజిత్ నటించిన 'వేదాళమ్ ' తమిళనాట బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.