చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఊహించని తీర్పు

  • IndiaGlitz, [Tuesday,January 16 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు అనుకూలంగా 17ఏ సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా.. 17ఏ వర్తించదని జస్టిస్ త్రివేది తెలియజేశారు. దీంతో తమకు దీనిపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని.. దీంతో తుది నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు నివేదిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవితవ్యం సీజేఐ చేతుల్లోకి వెళ్లింది.

స్కిల్ డెవలెప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది అక్టోబర్ 18న తీర్పు రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే అక్టోబర్ 31న ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తర్వాత నవంబర్ 20న దానిని రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇక ఇటీవల ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

అయితే క్వాష్ పిటిషన్‌పై తీర్పు మాత్రం పెండింగ్‌లో ఉంది. మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న తీర్పును ఇవాళ ధర్మాసనం వెల్లువరించింది. కానీ స్పష్టమైన తీర్పు రాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడక తప్పదు. చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మాత్రం ప్రజాప్రతినిధులపై 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు. వ్యతిరేకంగా వస్తే మాత్రం మరిన్ని కేసులు పెట్టే అవకాశం అధికారులకు ఉంటుంది. మరి సీజేఐ ఎలాంటి తీర్పు ఇస్తారో.. అది కూడా ఎప్పుడూ ఇస్తారో స్పష్టంగా తెలియకపోవడంతో మరికొన్ని రోజలు వేచి చూడక తప్పదు.

More News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వ్యవహారంలో ట్విస్ట్

లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)కేసులో రోజుకొక కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. విచారణను వేగంవంతం చేసిన ఈడీ అధికారులు తాజాగా

దళిత ద్రోహి చంద్రబాబు కుల అహంకారాన్ని అణివేస్తామని హెచ్చరిక

పేరుకేమో మాది దళితులను గౌరవించే పార్టీ.. బీసీలకు రాజకీయంగా చేయిందించే పార్టీ అని ప్రగాల్బాలు పలుకుతూ ఉంటారు. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా

Chandrababu-Pawan: ఎన్నికల్లో ఎలా ముందుకెళ్దాం.. చంద్రబాబు, పవన్ సుదీర్ఘ చర్చలు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .. మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే హైదరబాద్‌తో పాటు విజయవాడలో పలు మార్లు చంద్రబాబు భేటీ అయిన పవన్ కల్యాణ్..

నేటి నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర'కు రాహుల్ గాంధీ శ్రీకారం

'భారత్ జోడో న్యాయ యాత్ర’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి శ్రీకారం చుట్టారు. మణిపుర్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,

భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్.. డ్యాన్స్ వేసిన మంత్రి అంబటి..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ముందుగా జరుపుకుంటున్నారు.