అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సలహాలతో అనగనగా ఫిల్మ్ కంపెనీ సంస్థ ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రానికి శ్రీకారం చుట్టింది. పూజా.కె.దోషి హీరోయిన్‌గా , హరీష్ కల్యాణ్, సాయిరోనక్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనగనగా ఫిల్మ్ కంపెనీ పతాకంపై పట్టాబి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ: ఇదొక సింపుల్ లవ్‌స్టోరీ, ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిల మధ్య జరిగే ఈ ముక్కోణపు ప్రేమకథలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి. ఇప్పటి వరకు ఎనభైశాతం షూటింగ్ పూర్తయింది.కొత్త పాత నటీనటుల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్తదనం ఆశించేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో రెండు ప్రీలుక్ పోస్టర్స్‌ను ఈ నెల 12, 13 తేదిలలో విడుదల చేసి, ప్రేమికుల దినోత్సవం రోజున చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
పూజా.కె.దోషి, హరీష్ కల్యాణ్, సాయిరోనక్, మోహన్మ్రన్, డా.మంజరి షర్మీల, సంధ్య జనక్, భాను అవిర్నేని, సుదర్శన్, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్.వి.జోసెఫ్, సంగీతం: ప్రసన్న్, ప్రవీణ్, శ్యామ్, ఎడిటింగ్: మర్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగా, లైన్ ప్రొడ్యూసర్: పి.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం-నిర్మాత: పట్టాబి.ఆర్.చిలుకూరి.

More News

మార్చి 3న చిత్రాంగద

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్లు సంయుక్త

ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభం!

ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.

'కాటమరాయుడు' నైజాం హక్కులను దక్కించుకున్న....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కిషోర్ పార్థసాని(డాలీ)దర్శకత్వంలో

ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైన పూరి, ఇషాన్ 'రోగ్'...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...దర్శకత్వంలో సినిమా అంటే యంగ్ హీరోస్ అందరూ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

విశాల్ విలన్..ఇప్పుడు విక్రమ్ తో ఢీ అంటున్నాడు...

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. అందుకే తెలుగు, తమిళంలో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడు సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.