ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,March 15 2022]

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'హైవే'. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత‌ వెంకట్‌ తలారి.

ఇవాళ ఆనంద్ దేవరకొండ సందర్భంగా 'హైవే'చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విశెస్ చెప్పింది చిత్ర యూనిట్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు 'హైవే'మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు

సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌, సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.

More News

హీరో ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా  'బేబీ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జగన్‌తో రాజమౌళి, డీవీవీ దానయ్య భేటీ: టాలీవుడ్ అటెన్షన్, ఈ కలయిక ‘ఆర్ఆర్ఆర్’ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు.

అసెంబ్లీని కుదిపేసిన జంగారెడ్డి గూడెం ఘటన.. ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

కేంద్రం కీలక నిర్ణయం.. 12-14 ఏళ్ల వయసు వారికీ కరోనా వ్యాక్సిన్, ఆ రోజు నుంచే

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ మరింత పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిన కేంద్రం..

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’.