నవంబర్ 12న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ "పుష్పక విమానం"

  • IndiaGlitz, [Wednesday,October 27 2021]

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పుష్పక విమానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా పుష్పక విమానం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న పుష్పక విమానం ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ పుష్పక విమానం సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది.

పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర

More News

కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో

'రంగమార్తాండ' కు మెగాస్టార్ గాత్ర దానం

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద దిక్కుగా వున్నారు మెగాస్టార్ చిరంజీవి.

రాధేశ్యామ్:  'ప్రేరణ' ఎవరు, విక్రమాదిత్యతో పరిచయం ఎలా.. పూజా హెగ్డేపై టీజర్!

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’.

బిగ్‌బాస్ 5 తెలుగు: కెప్టెన్సీ కోసం పాడరాని పాట్లు.. పేడలో షణ్ముఖ్, చెమట చిందించిన శ్రీరామ్

బిగ్‌బాస్ 5 తెలుగులో 51వ రోజు ఎపిసోడ్స్ కాస్త ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల మేళవింపుగా సాగింది.

‘వరుడు కావలెను‘ లో భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది - రీతువర్మ

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది.