ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`

  • IndiaGlitz, [Friday,July 10 2020]

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 11గా నిర్మించిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌'. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా....

'మిడిల్ క్లాస్ మెలోడీస్‌' చిత్ర నిర్మాత వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ''సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. క‌థ‌కు ప్రాధాన్య‌మిస్తూ సినిమాలు తీద్దామ‌నుకునే నిర్ణ‌యంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. గుంటూరు జిల్లా కొల‌క‌లూరు ప్రాంతంలోనూ, గుంటూరు సిటీలోనూ... ప‌రిసర‌ ప్రాంతాల్లోనూ షూటింగు చేశాం. పాత్ర‌ల‌న్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేస‌వికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ లాక్ డౌన్ ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాం’’ అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ మామూలు మనుషుల జీవితాలలో ఉండే సున్నితమయిన హాస్యాన్ని ఇందులో చూపించాము. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆనంద్ దేవ‌ర‌కొండ తొలి చిత్రం 'దొర‌సాని'కి పూర్తి భిన్నంగా ఇందులో ఆయ‌న పాత్ర ఉంటుంది.’కేరాఫ్ కంచ‌ర‌పాలెం'తో పాటు ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించిన స్వీక‌ర్ అగ‌స్తి మా చిత్రానికి మంచి పాట‌లు ఇచ్చారు. మొత్తం ఐదు పాట‌లున్నాయి'' అని అన్నారు.

న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, చైత‌న్య గ‌రిక‌పాటి, దివ్య శ్రీపాద‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, సుర‌భి ప్ర‌భావ‌తి, ప్రేమ్ సాగ‌ర్‌, ప్ర‌భావ‌తి వ‌ర్మ త‌దిత‌రులు

More News

2 రోజులుగా అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి.. చివరకు..

నిండు గర్భిణి.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే జంట నగరాల్లోని పలు హాస్పిటల్స్ తిరిగింది.

పొలిటికల్ జిమ్మిక్‌లొద్దు: కేసీఆర్ మిస్సింగ్ పిటిషన్‌పై హైకోర్టు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు.. అసలేం జరిగింది!

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్, పూజాల రొమాంటిక్ స్టిల్‌తో ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది.

రఘురామ కృష్ణరాజుపై వరుస కేసులు.. దారిలోకి తెచ్చే యత్నం!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును దారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.