close
Choose your channels

బెల్లంకొండ గణేష్ స‌ర‌స‌న ఓ జోడిగా!

Monday, October 21, 2019 • తెలుగు Comments

బెల్లంకొండ గణేష్ స‌ర‌స‌న ఓ జోడిగా!

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో త‌న‌యుడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.  బీటెల్ లీఫ్ ప్రొడక్షన్, లక్కీ మీడియా ప‌తాకాల‌పై ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తుండ‌టం విశేషం. 

ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో 5గురు హీరోయిన్స్ ఉంటార‌ట‌. అందులో ఓ హీరోయిన్‌గా అన‌న్య అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ట‌. ఈమె పాత్ర చాలా చిన్న‌గానే ఉంటుందట‌. ఇంత‌కు అన‌న్య అగ‌ర్వాల్ ఎవ‌రో తెలుసా? మ‌జిలీ చిత్రంలో నాగ‌చైత‌న్య ప్రేయ‌సి కుమార్తెగా.. లేడీ క్రికెట‌ర్‌గా న‌టించిన అమ్మాయి. అనన్య అగ‌ర్వాల్ పాత్ర చిన్న‌దే అయినా పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ఉండాలో తెలుసుకోవాలంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం అందిస్తుండ‌గా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz